Tuesday, 20 October 2026
Header1
BREAKING

ప్రతి ఇంటా సౌర శక్తి వినియోగం పెరగాలి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 08 Oct 2026, 06:56 PM
🔄 నవీకరణ: 18 Oct 2026, 08:57 AM
👁️ 115 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

- పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - పర్యావరణ పరిరక్షణకు సోలార్ ఎనర్జీ ఎంతో దోహదం : ఎమ్మెల్యే జూలకంటి

మాచర్ల: అక్టోబర్ 08 రాజధాని వాయిస్ :

ప్రతి ఇంటా సౌర శక్తి వినియోగం పెరిగేలా ప్రజలు ఆసక్తి చూపాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. గురువారం స్థానిక వడ్డె ఓబన్న విగ్రహం వద్ద విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎం సూర్య ఘర్ సేవా సేతు అభియాన్ పథకంపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తృతం చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు సాంప్రదాయ విద్యుత్ వనరులతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీలను అందిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 100 శాతం సబ్సిడీతో సోలార్ ప్యానెళ్లను అందించే అవకాశం ఉందని, అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ వినియోగం పెరిగితే పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ రంగంపై భారాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడుతుందని అన్నారు.

అనంతరం సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ‘గ్రీన్ ఇండియా’కు మద్దతు తెలుపుతూ ఏర్పాటు చేసిన కార్డుబోర్డు వద్ద ఎమ్మెల్యే ఫొటో దిగారు.

ఈ కార్యక్రమంలో ఏడీఈ నాగ సురేంద్ర కుమార్, ఏఈలు కోటేశ్వరరావు, శ్రీశైలం, జెస్సి జైకర్, సీతారాములు, కూటమి పార్టీల నాయకులు కజ్జం సైదయ్య, యెనుముల కేశవరెడ్డి, కొమెర దుర్గారావు, అనంతరాములు, వజ్రం నాయక్, కంభంపాటి అనిల్, మున్నా రాంబాబు, పోలా సత్యం, లాల్ కిషన్, కల్యాణి సోలార్ సీఈవో లీలా ప్రసాద్, చంటి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X