Sunday, 25 October 2026
Header1
BREAKING

మాచర్ల 5వ వార్డులో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం

- ప్రచారంలో పాల్గొన్న చైర్మన్ అభ్యర్థి యెనుముల సుష్మా

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 25 Oct 2026, 09:05 PM
👁️ 1 views

మాచర్ల, అక్టోబర్ 25 (రాజధాని వాయిస్): 
మాచర్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ 5వ వార్డు అభ్యర్థి నక్షత్ర ప్రసాదు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న  యెనుముల సుష్మా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి నాయకులు ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రజలతో మమేకమై, పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, మైలా శ్రీనివాస్  ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ మాచర్ల నియోజకవర్గం, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X