దీనమ్మ సీజనల్ హాస్టల్ ను సందర్శించినగుంటూరు వెస్ట్ మండల విద్యాశాఖ అధికారి కుంభ నాగేంద్రం
గుంటూరు.రాజధానికి వాయిస్:
గుంటూరు పట్నంలోని చిలకలూరిపేట రోడ్డులో నేతాజీ నగర్ లో దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గుంటూరు సమగ్ర శిక్ష ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్ ను శనివారం గుంటూరు వెస్ట్ మండల విద్యాశాఖ అధికారి కుంభ నాగేంద్రం సందర్శించి, మిరపకాయల తొడియాల నుండి పిల్లలను అక్షరానికి దగ్గరగా చేర్చాలని ఆమె వాలంటీర్లకు సూచించారు..
గుంటూరు పట్టణంలోని మిర్చి యార్డు ఏరియాలో బీహార్ ఒరిస్సా ఉత్తరాఖండ్ నుండి ఉపాధి కోసం మిర్చి తొడియాలు తీయటానికి తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలను నైతిక విలువలతో కూడిన విద్యాభ్యాసం చేయాలని, వారి మాతృ భాషలో విద్యాభ్యాసం చేయాలని, పౌష్టికాహారం అందజేయాలని, ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ విధిగా అందజేయాలని, గుంటూరు పట్నం ను బాల కార్మికులు లేని ప్రాంతంగా ఉంచాలన్నారు. ఆమెతోపాటు దీనమ్మ సీజనల్ హాస్టల్ వాలంటీర్ షేక్ రఫీ కేర్ షేక్ రజియా బేగం దీనమ్మ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గరికపాటి రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు.
Be the first to share your thoughts on this story!