విద్యతోనే సర్వ సమస్యలకు పరిష్కారం: మెట్టు గోవిందరెడ్డి
ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ:08 Sep 2026, 07:25 PM
🔄 నవీకరణ:23 Sep 2026, 03:17 PM
👁️ 12 views
మాచర్ల సెప్టెంబర్ 08 రాజధాని వాయిస్ :
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మాచర్ల కస్తూర్బా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు మెట్టు గోవిందరెడ్డి. ప్రతి ఒక్కరూ అక్షరాస్యతను సాధించి , తద్వారా జ్ఞానాన్ని సాధించి ఆ జ్ఞానాన్ని సమాజానికి ,దేశానికి పంచాలని మాచర్ల మండల న్యాయశాఖ కమిటీ సభ్యులు మరియు పల్నాడు జిల్లా దిశ కమిటీ మెంబర్ మరియు శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు మెట్టు గోవింద రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల పట్టణంలోని
కస్తూర్బా
పాఠశాలలో మాచర్ల మండలా న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల మండల న్యాయశాఖ కమిటీ సభ్యులు ,పల్నాడు జిల్లా దిశ కమిటీ మెంబర్ మరియు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అక్షరమే ఒక ఆయుధమని ఆ ఆయుధాన్ని మీరు ఉపయోగించుకొని ,ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరక్షరాస్యతను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేయాలని గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. వేసవి సెలవులలో ,సంక్రాంతి సెలవుల్లో, దసరా సెలవులలో మీరు మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని అక్షరాస్యులు గా చేసే బాధ్యత తీసుకొని మహానుభావులు కలలుగన్న నవభారత నిర్మాణానికి నాంది పలకాలని గోవిందరెడ్డి పిలుపునిచ్చారు.
మెట్టు గోవిందా రెడ్డి
నిరక్షరాస్యత వల్ల ప్రజలు పడే ఇబ్బందులను గమనించి భావిభారత పౌరులు ఆ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేసే బాధ్యతను తీసుకోవాలని తెలిపారు. ఒక్క సిరా సుక్క లక్షలాది మెదడులను కదిలించి వేస్తుందని, విద్య వల్ల జ్ఞానం పెరిగి ఆ జ్ఞానాన్ని పదిమందికి పంచే నైపుణ్యం వస్తుందని తద్వారా ప్రపంచం మొత్తం జ్ఞానవంతం అవుతుందని గోవింద రెడ్డి పిలుపునిచ్చారు. సర్వ సమస్య పరిష్కారినీ విద్య అని, విద్య ద్వారా పరిష్కరించలేని సమస్య ఒకటి కూడా లేదని అన్న స్వామి వివేకానంద సూక్తులను ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి వారికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రామ్ నాయక్, న్యాయావాది పుల్లారావు , ప్రిన్సిపల్ కవితా, పిఈటి తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే సర్వ సమస్యలకు పరిష్కారం: మెట్టు గోవిందరెడ్డి
మాచర్ల సెప్టెంబర్ 08 రాజధాని వాయిస్ :అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మాచర్ల కస్తూర్బా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు మెట్టు గోవిందరెడ్డి. ప్...
మాచర్ల సెప్టెంబర్ 08 రాజధాని వాయిస్ :
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మాచర్ల కస్తూర్బా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు మెట్టు గోవిందరెడ్డి. ప్రతి ఒక్కరూ అక్షరాస్యతను సాధించి , తద్వారా జ్ఞానాన్ని సాధించి ఆ జ్ఞానాన్ని సమాజానికి ,దేశానికి పంచాలని మాచర్ల మండల న్యాయశాఖ కమిటీ సభ్యులు మరియు పల్నాడు జిల్లా దిశ కమిటీ మెంబర్ మరియు శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు మెట్టు గోవింద రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల పట్టణంలోని
కస్తూర్బా
పాఠశాలలో మాచర్ల మండలా న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల మండల న్యాయశాఖ కమిటీ సభ్యులు ,పల్నాడు జిల్లా దిశ కమిటీ మెంబర్ మరియు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అక్షరమే ఒక ఆయుధమని ఆ ఆయుధాన్ని మీరు ఉపయోగించుకొని ,ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరక్షరాస్యతను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేయాలని గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. వేసవి సెలవులలో ,సంక్రాంతి సెలవుల్లో, దసరా సెలవులలో మీరు మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని అక్షరాస్యులు గా చేసే బాధ్యత తీసుకొని మహానుభావులు కలలుగన్న నవభారత నిర్మాణానికి నాంది పలకాలని గోవిందరెడ్డి పిలుపునిచ్చారు.
మెట్టు గోవిందా రెడ్డి
నిరక్షరాస్యత వల్ల ప్రజలు పడే ఇబ్బందులను గమనించి భావిభారత పౌరులు ఆ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేసే బాధ్యతను తీసుకోవాలని తెలిపారు. ఒక్క సిరా సుక్క లక్షలాది మెదడులను కదిలించి వేస్తుందని, విద్య వల్ల జ్ఞానం పెరిగి ఆ జ్ఞానాన్ని పదిమందికి పంచే నైపుణ్యం వస్తుందని తద్వారా ప్రపంచం మొత్తం జ్ఞానవంతం అవుతుందని గోవింద రెడ్డి పిలుపునిచ్చారు. సర్వ సమస్య పరిష్కారినీ విద్య అని, విద్య ద్వారా పరిష్కరించలేని సమస్య ఒకటి కూడా లేదని అన్న స్వామి వివేకానంద సూక్తులను ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి వారికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రామ్ నాయక్, న్యాయావాది పుల్లారావు , ప్రిన్సిపల్ కవితా, పిఈటి తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!