Tuesday, 20 October 2026
Header1
BREAKING

పోలింగ్ విధులపై పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

గుంటూరు జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ.

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 17 Oct 2026, 03:36 PM
🔄 నవీకరణ: 18 Oct 2026, 06:39 AM
👁️ 8 views

గుంటూరు.

అక్టోబర్ 17:

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ సూచించారు.
శనివారం గుంటూరు నగరంలోని ఏసీ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ మహిళా కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సిబ్బంది శిక్షణా తరగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ విధులకు సంబంధించి సిబ్బంది తమ సందేహాలను శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. సంబంధిత ఎన్నికల మెటీరియల్‌ను క్షుణ్ణంగా చదివి, పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అశ్రద్ధకు తావులేకుండా, నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్, ఇతర అధికారులు ఉన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X