మాచర్ల: సెప్టెంబర్ 24 రాజధాని వాయిస్
మాచర్ల పట్టణంలోని 22వ వార్డులో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు పాల్గొని వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!