Tuesday, 20 October 2026
Header1
BREAKING

మొబైల్ పోయిందని దిగులొద్దు...

సీఈఐఆర్ అస్త్రంతో రూ.95 వేల విలువైన ఫోన్లు రికవరీ చేసిన నరసరావుపేట పోలీసులు!

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 నరసరావుపేట
📅 ప్రచురణ: 10 Sep 2026, 11:34 AM
🔄 నవీకరణ: 12 Oct 2026, 05:45 AM
👁️ 391 views
నరసరావుపేట (పల్నాడు జిల్లా):
విలువైన మొబైల్ ఫోన్లు పోగొట్టుకుని ఆందోళనలో ఉన్న బాధితులకు కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ (CEIR) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు ఊరట కల్పించారు. గుంటూరుకు చెందిన దవనం అరుణ్ కుమార్, హైదరాబాద్‌కు చెందిన శ్యామల ప్రదీప్, అనకాపల్లికి చెందిన కేతిరెడ్డి ఉష శ్రీలు పోగొట్టుకున్న సుమారు రూ.95 వేల విలువైన మూడు ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేసి బాధితులకు అందజేశారు.
మొబైల్స్ పోయిన వెంటనే బాధితులు సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయగా, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ ఎస్.కె.టి. ఫిరోజ్ ఆధ్వర్యంలోని పోలీస్ బృందం సాంకేతిక ఆధారాలతో గాలించి ఆ ఫోన్లను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకుంది. అనంతరం రికవరీ చేసిన మొబైళ్లను పోలీస్ స్టేషన్‌లో బాధితులకు స్వయంగా అప్పగించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ఫిరోజ్ మాట్లాడుతూ.. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే కంగారు పడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేసి, సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని, ఈ ఆధునిక సాంకేతికతను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X