అమృతలూరు, సెప్టెంబర్ 06
పోలింగ్ కేంద్ర పరిధిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలు బి యల్ ఓ, ఎ ఇ ఆర్ ఓ లాగిన్ లో ఉన్న వాటిని వెంటనే హీయరింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. పేర్కొన్నారు.
అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 79 మరియు 80 పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక సంక్లిప్త ఓటర్ల సవరణప్రక్రియ లో బాగంగా నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్ర పరిధిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలు బి యల్ ఓ, ఎ ఇ ఆర్ ఓ లాగిన్ లో ఉన్న వాటిని వెంటనే హీయరింగ్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సందర్భంగా రెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బి యల్ ఓ లతో కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్య, అలాగే మ్యాపింగ్ చేయని వాటికి సంబంధించిన పెండింగ్ నోటీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 79 పోలింగ్ కేంద్ర పరిధిలో 5 మ్యాపింగ్ చేయని ఓటర్లు మరియు 80 పోలింగ్ కేంద్రం పరిధిలో 2 మ్యాపింగ్ ఓటర్లు కు సంబంధించి నోటీసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని బి యల్ ఓ లు జిల్లా కలెక్టర్ కుతెలియజేశారు. ఓటర్ల ఫోటోలు నమోదు మొదలగు విషయాల సర్ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఉన్నాయాని కలెక్టర్ బి యల్ ఒల ను అడిగితెలుసుకున్నారు.అనంతరం పాఠశాల సమీపంలో ఒక వృద్ధ మహిళను కలెక్టర్ గారు గమనించి, ఆమెతో మాట్లాడగా, ఆమె తనకు ఇల్లు ఇదేనని, తనకు పెన్షన్ రావడం లేదని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకురాగా. వృద్ధ మహిళలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్ కు పంపించాలని సెక్రటరీని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఆర్ ఓ,సూపర్వైజర్, బి యల్ ఓ లు, వి ఆర్ ఓ లు .తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!