కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి చరిత్రలో నిలిచిపోయేలా కనివిని ఎరుగని రీతిలో వేల కోట్ల నిధులు కేటాయిస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. మంగళవారం పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు హైబ్రిడ్ యాన్యూటి మోడల్ పథకం ద్వారా రూ. 30 కోట్ల నిధులను ప్రభుత్వ కేటాయింపులు జరపగా.., ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్ గా శంకుస్ధాపనలు చేశారు. శంకుస్ధాపనలు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు మాచర్ల పట్టణంలో పర్యటించినప్పుడు మున్సిపాలిటి అభివృద్ధికి రూ. 50 కోట్లు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారని.., ఇచ్చిన మాటకు కట్టుబడి దఫాలు వారీగా నిధులు అందజేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలకు రూ.2 కోట్ల నిధులు రావడమే గొప్పగా భావించే పరిస్థితి ఉండేదని, ఒకేసారి రూ.30 కోట్ల నిధులు మున్సిపాలిటికి సమకూర్చుడం గర్వంగా ఉందన్నారు. సమగ్ర తాగునీటి సరఫరాకు దాదాపు రూ.1,000 కోట్లతో భారీ ప్రాజెక్టులు నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని.., వరికపూడిశెలపై ప్రత్యేక దృష్టితో భూసేకరణ ప్రక్రియను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని లక్ష్యంతో అడుగులు ముందుకు పడుతున్నాయని వివరించారు. వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో సాగు,తాగు నీటి వసతులు మెరుగుపడటంతో పాటు వ్యవసాయ రంగానికి తిరుగులేని ఊతం లభిస్తోందని ఆయన వెల్లడించారు. మరోవైపు పర్యాటకం, పరిశ్రమలకు సైతం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని.., వెనుకబడిన ఎగువ పల్నాడుకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల జీవనాడిలా మారబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి మరిన్నీ నిధులు తెచ్చి.., అధికారులు సమన్వయంతో ప్రజలకు, ప్రాంతాల అభివృద్ధికి మేలు జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ వేణుబాబు, టీడీపీ సీనియర్ నాయకులు యాగంటి మల్లికార్జునరావు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మధుసూదన్ యాదవ్, ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్, కజ్జం సైదయ్య, యెనుముల కేశవరెడ్డి, మద్దిగపు పెదవెంకటరామిరెడ్డి, కొమెర దుర్గారావు, పోలూరు నరసింహారావు, మద్దిగపు చిన వెంకటరామిరెడ్డి, మాచర్ల వాసు, కంభపాటి అనిల్ కుమార్, మందలపు రామకృష్ణ, వజ్రం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మాచర్ల సెప్టెంబర్ 22 రాజధాని వాయిస్ :కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి చరిత్రలో నిలిచిపోయేలా కనివిని ఎరుగని రీతిలో వేల కోట్ల నిధులు కేటాయిస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. మంగళవారం ...
మాచర్ల సెప్టెంబర్ 22 రాజధాని వాయిస్ :
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి చరిత్రలో నిలిచిపోయేలా కనివిని ఎరుగని రీతిలో వేల కోట్ల నిధులు కేటాయిస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. మంగళవారం పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు హైబ్రిడ్ యాన్యూటి మోడల్ పథకం ద్వారా రూ. 30 కోట్ల నిధులను ప్రభుత్వ కేటాయింపులు జరపగా.., ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్ గా శంకుస్ధాపనలు చేశారు. శంకుస్ధాపనలు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు మాచర్ల పట్టణంలో పర్యటించినప్పుడు మున్సిపాలిటి అభివృద్ధికి రూ. 50 కోట్లు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారని.., ఇచ్చిన మాటకు కట్టుబడి దఫాలు వారీగా నిధులు అందజేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలకు రూ.2 కోట్ల నిధులు రావడమే గొప్పగా భావించే పరిస్థితి ఉండేదని, ఒకేసారి రూ.30 కోట్ల నిధులు మున్సిపాలిటికి సమకూర్చుడం గర్వంగా ఉందన్నారు. సమగ్ర తాగునీటి సరఫరాకు దాదాపు రూ.1,000 కోట్లతో భారీ ప్రాజెక్టులు నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని.., వరికపూడిశెలపై ప్రత్యేక దృష్టితో భూసేకరణ ప్రక్రియను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని లక్ష్యంతో అడుగులు ముందుకు పడుతున్నాయని వివరించారు. వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో సాగు,తాగు నీటి వసతులు మెరుగుపడటంతో పాటు వ్యవసాయ రంగానికి తిరుగులేని ఊతం లభిస్తోందని ఆయన వెల్లడించారు. మరోవైపు పర్యాటకం, పరిశ్రమలకు సైతం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని.., వెనుకబడిన ఎగువ పల్నాడుకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల జీవనాడిలా మారబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి మరిన్నీ నిధులు తెచ్చి.., అధికారులు సమన్వయంతో ప్రజలకు, ప్రాంతాల అభివృద్ధికి మేలు జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ వేణుబాబు, టీడీపీ సీనియర్ నాయకులు యాగంటి మల్లికార్జునరావు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మధుసూదన్ యాదవ్, ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్, కజ్జం సైదయ్య, యెనుముల కేశవరెడ్డి, మద్దిగపు పెదవెంకటరామిరెడ్డి, కొమెర దుర్గారావు, పోలూరు నరసింహారావు, మద్దిగపు చిన వెంకటరామిరెడ్డి, మాచర్ల వాసు, కంభపాటి అనిల్ కుమార్, మందలపు రామకృష్ణ, వజ్రం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!