అక్రమ కట్టడాలు కూల్చివేసిన ఫారెస్ట్ అధికారులు
రాజుపాలెం.సెప్టెంబర్ 19,రాజధాని వాయిస్:
పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి జి.కృష్ణ ప్రియ ఆదేశాల మేరకు రాజుపాలెం మండలం, కొండమోడు దగ్గర గల వీరమ్మ కాలనీలో రిజర్వ్ ఫారెస్ట్ లో కట్టిన అక్రమ నిర్మాణాలను రాజుపాలెం పోలీస్ లు, అటవీశాఖ సిబ్బంది సమన్వయంతో తొలగించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవిలో ఎవరైన ఆక్రమణలు,అక్రమ కట్టడాలు కట్టిన ఎడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డివి రమణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బి.వి.ఎల్ నాయుడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్యాం కుమార్, ప్రొటెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!