నారాయణ ఈఎం పాఠశాలలో డెలిబరేషన్ కార్యక్రమం
సత్తెనపల్లి, అక్టోబర్ 1,రాజధాని వాయిస్:
నారాయణ ఈఎం పాఠశాల, సత్తెనపల్లి శాఖలో ఈ-టెక్నో విద్యార్థుల కోసం డెలిబరేషన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు.ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ మాట్లాడుతూ, డెలిబరేషన్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, ఆత్మవిశ్వాసం, సంభాషణా నైపుణ్యాలు మరియు వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం జనకీరామిరెడ్డి, లైఫ్ స్కిల్స్ విభాగం మేనేజర్ వేదావతి, అసిస్టెంట్ మేనేజర్ సాదిక్, ఆర్ఎస్టీ అఖిల, బ్రాంచ్ ఎల్ఎస్టీ లావణ్య, హైస్కూల్ కోఆర్డినేటర్ భద్రారెడ్డి, అకాడమిక్ డీన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎల్ఎస్టీ విభాగానికి ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
Be the first to share your thoughts on this story!