మాచర్ల : సెప్టెంబర్ 16 రాజధాని వాయిస్ :
ఈనెల 21, సోమవారం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియాకు తెలిపారు. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు రెవెన్యూ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెహ్రునగర్ బోటు మీద ఉన్న వి.వి.ఎన్ గార్డెన్స్ నందు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, తదితర అన్ని శాఖల జిల్లా, నియోజకవర్గ స్థాయి ఉన్నతాధికారులు ప్రజా గ్రీవెన్స్ లో పాల్గొంటారని, అందుకు తగినట్లు అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పెండింగ్ ఉన్న రెవెన్యూ, ఇతర సమస్యలను అర్జీల రూపంలో అందించి, పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ సమావేశంలో మండల తహశీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, హోసింగ్ ఏఈ మరియదాసు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!