Tuesday, 20 October 2026
Header1
BREAKING

అక్షరాస్యతపై కూటమి సర్కారు అసత్య ప్రచారం:<div><br></div><div> వైఎస్‌ జగన్‌</div>

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Sep 2026, 06:51 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 36 views

ఇంకా ముగియని 2026కు గణాంకాలు ఎలా వచ్చాయి?

పీఎల్‌ఎఫ్‌ఎస్‌ నివేదికల ప్రకారం ఏపీలో రేటు 71.4 శాతమే

‘రెడ్‌బుక్‌’పై కాకుండా విద్యాశాఖపై దృష్టి పెట్టాలని లోకేశ్‌కు హితవు

అమరావతి: సెప్టెంబర్ 04
రాష్ట్రంలో అక్షరాస్యత రేటుపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో అక్షరాస్యత 2024 నాటి 72.6 శాతం నుంచి 2026 నాటికి ఏకంగా 82.1 శాతానికి పెరిగిందంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుత 2026 క్యాలెండర్‌ సంవత్సరమే ఇంకా ముగియనప్పుడు, ఏ అధికారిక సంస్థ కూడా ఇంకా తుది గణాంకాలను వెల్లడించనప్పుడు మంత్రి లోకేశ్‌ ఈ లెక్కలను ఎక్కడి నుంచి తెచ్చారని జగన్‌ ప్రశ్నించారు.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్‌వో విడుదల చేసిన ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) 2023-24 వార్షిక నివేదిక ప్రకారం ఏపీలో ఏడేళ్లకు పైబడిన వారిలో అక్షరాస్యత 72.6 శాతంగా నమోదైందని ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత 2026 జులైలో ప్రచురితమైన పీఎల్‌ఎఫ్‌ఎస్‌ 2025 నివేదికను పరిశీలిస్తే రాష్ట్ర అక్షరాస్యత 71.4 శాతానికి పరిమితమైనట్లు స్పష్టంగా ఉందని తెలిపారు. వాస్తవ నివేదికలు ఇంత పారదర్శకంగా కళ్లముందు కనిపిస్తున్నా, ప్రభుత్వం అసత్య గణాంకాలతో మోసపూరిత ప్రచారానికి ఒడిగట్టడం దారుణమన్నారు. ప్రస్తుత పాలకుల వైఫల్యాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పడిపోయి, ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారని కేంద్ర విద్యాశాఖ ‘యూడైస్‌’ లెక్కలే చాటిచెబుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేద వర్గాలకు విద్యను దూరం చేయకుండా సమస్యలను చక్కదిద్దడం మానేసి, విద్యాశాఖ మంత్రి ‘రెడ్‌బుక్‌ పాలన’కే పరిమితమయ్యారని మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపులు పక్కనపెట్టి తక్షణమే విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై సమయం కేటాయించాలని మంత్రి లోకేశ్‌కు జగన్‌ హితవు పలికారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X