వినుకొండ సెప్టెంబర్ 15 రాజధాని వాయిస్ :
వినాయక చవితి పండుగ సందర్భంగా వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటుచేసిన గణపతి మండపాలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కారంపూడి రోడ్డులోని గోల్డెన్ టవర్స్ అపార్ట్మెంట్స్, అమ్మవారి గుడి వద్ద ఉన్న గోల్డెన్ వెంచర్స్ మరియు 1వ వార్డు కళ్యాణపురి కాలనీలలో నిర్మించిన మండపాలను ఆయన దర్శించారు. ఈ సందర్భంగా జీవీ కి మండప నిర్వాహకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!