దుర్గి సెప్టెంబర్ 26 రాజధాని వాయిస్ :
పల్నాడు జిల్లా ఆర్యవైశ్య ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వైస్ చైర్మన్‌గా దుర్గి గ్రామానికి చెందిన ఓబుల్‌శెట్టి చెన్నకేశవరావు నియమితులయ్యారు. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చందోలు వెంకటకృష్ణ సూర్యప్రకాష్ రావు ఈ మేరకు ఆయనను అధికారికంగా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు చందోలు వెంకటకృష్ణ సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధిలోనూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలోనూ మీడియా పాత్ర ఎంతో కీలకమైనదన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య విలేకరుల సంక్షేమానికి, మీడియా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చెన్నకేశవరావు తన వంతు బాధ్యతగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.తమపై నమ్మకంతో ఈ కీలక జిల్లా స్థాయి బాధ్యతను అప్పగించిన జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు చందోలు వెంకటకృష్ణ సూర్యప్రకాష్ రావుకు ఓబుల్‌శెట్టి చెన్నకేశవరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని ఆర్యవైశ్య ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుంటూ, సంఘం ఆశయాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. చెన్నకేశవరావు నియామకం పట్ల పల్నాడు జిల్లా మరియు స్థానిక ఆర్యవైశ్య సంఘ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు, వివిధ పత్రికలు, ఛానల్స్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
Be the first to share your thoughts on this story!