మాచర్ల సెప్టెంబర్ 23 రాజధాని వాయిస్ :
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) క్రియాశీల సభ్యత్వంతో పాటు మాచర్ల పట్టణ ఉపాధ్యక్ష పదవికి బొడ్డుపల్లి ఈశ్వరయ్య స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. బుధవారం మాచర్లలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని పట్టణ అధ్యక్షులు ఓర్చు కాంతికుమార్కు అందజేశారు.
ఈ సందర్భంగా బొడ్డుపల్లి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. తాను ఎటువంటి ప్రలోభాలకు, స్వలాభాలకు లొంగకుండా ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. స్వచ్ఛందంగా బీజేపీ క్రియాశీల సభ్యత్వానికి, పట్టణ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను బీసీ నవ చైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు ఈశ్వరయ్య తెలిపారు. ప్రజా సంఘం ద్వారా ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజా సేవకు అంకితభావంతో తన వంతు కృషి కొనసాగిస్తానని బొడ్డుపల్లి ఈశ్వరయ్య పేర్కొన్నారు.
Be the first to share your thoughts on this story!