*పేదోళ్ల ముంగిట సినిమాటోగ్రఫీమంత్రి దుర్గేష్ జన్మదిన వేడుకలు*
✓ నూతన వస్త్రాలు భోజనం పంపిణి
✓వేడుకల్లో గిరిజనుల సంప్రదాయ నృత్యం
తెనాలి రూరల్,సెప్టెంబర్ 17,రాజధాని వాయిస్:
ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలను గురువారం రూరల్ మండలం కొలకలూరు గ్రామo ఊరు వెలుపల చెట్లకింద,పాముల పుట్టల ప్రక్కనే నివశిస్తున్న నిరుపేద యానాదుల ముంగిట మా-ఏపి సభ్యులు ఘనంగా నిర్వహిoచారు.జన్మదిన వేడుకల కేక్ ను యానాదుల మహిళతోనే కట్ చేపిoచడo విశేషం.ఈ సందర్భంగా మా-ఏపీ వ్యవస్థాపకులు సినీదర్శకుడు దిలీప్ రాజా గిరిజనులనుద్దేశించి మాట్లాడుతూ పేదోళ్ల నిష్కల్మషమైన ఆసీస్సుల్లో స్వార్ధం ఉండదన్నారు.మంత్రి కందుల దుర్గేష్ కు పేదల పక్షపాతిగా గుర్తింపు ఉందని ఆయన చెప్పారు.అందుకే పేదోళ్ల ముంగిట మంత్రి జన్మదిన వేడుకలను మా-ఏపి నిర్వహించడమైనదని ఆయన స్పష్టం చేశారు.నిరుపేద గిరిజనులకు నూతన వస్త్రాలను పంపిణి చేశారు.మంత్రి దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద యానాదులకు ఆధార్ కార్డుల మంజూరు కోసం తగిన చర్యలను తీసుకున్నట్లు దిలీప్ రాజా తెలిపారు.కొందరు పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్
నిండు నూరేళ్లు సంతోషంగా ఆ రోగ్యంగా ఉండాలని యానాదుల ఆయా ఆచార పద్ధతిలో ప్రార్థనలు నిర్వహిoచారు.నటి రమ్య రాథోడ్ అధ్వర్యంలో గిరిజనులు సాoప్రదాయ నృత్యo చేశారు.
అనంతరం సహాపoక్తి భోజనాలు చెట్లకిందనే చేశారు . కార్యక్రమంలో
నటీ నటులు నటి రమ్య రాథోడ్ , సైదులు యాదవ్,సముద్రాల శ్రీధర్ శర్మ, ఆనంద్ తదితరులు పాల్గోన్నారు.
ఫోటో రైటప్
1.యానాదులకు నూతన వస్త్రాలను పంపిణి చేస్థున్న దిలీప్ రాజా ,
మా-ఏపి సభ్యులు
2.బిర్యానీ పాకెట్లు అందిస్థున్న దిలీప్ రాజా
Be the first to share your thoughts on this story!