క్యాంపు -పియు స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో చిలకలూరిపేట లోని ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐ.ఈ.సి (ఇన్ఫర్మేషన్ , ఎడ్యుకేషన్ , అండ్ కమ్యూనికేషన్ - ఐఈసి) అవగాహన కార్యక్రమాన్ని స్థానిక చిలకలూరిపేట లోని పురపాలక సంఘం కార్మికులతో సానటరీ ఇన్స్పెక్టర్స్ వెంకటేశ్వర్లు గారు మరియు శ్రీమతి సునీత గారి అదర్యం లో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికుల కు హెచ్ఐ వి గురించి మరియు హెచ్ఐవి ఎన్ని మార్గాలు ద్వారా వస్తుంది అనే విషయాలను తెలియచేసారు.ఈ కార్యక్రమం కు ఏరియా హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ కె. హనుమంత్ రావు గారు మాట్లాడుతూ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు గురించి మరియు కార్మికుల పని చేసే సమయములో తప్పనిసరిగా గ్లౌజ్ దరించి పని చేయాలనీ తెలియ చేసారు .ఈ కార్యక్రమం లో క్యాంపు సంస్థ మేనేజర్ కొండా. పవన్ కళ్యాణ్ గారు మరియు డేటా ఆపరేటర్ వల్లే. శివ, ఎఎన్ఏం ఊహ మరియు క్యాంపు అవుట్ రీచ్ వర్కర్స్, మరియు పురపాలక సంఘం సూపెర్వైజర్స్ , కార్మికులు పాల్గొనడం జరిగింది.
Be the first to share your thoughts on this story!