చిలకలూరిపేట సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల చిరుమామిళ్ల క్యాంపు -పియు స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో చిలకలూరిపేట లోని ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐ.ఈ.సి (ఇన్ఫర్మేషన్ , ఎడ్యుకేషన్ , అండ్ కమ్యూనికేషన్ - ఐ.ఈ.సి ) అవగాహన కార్యక్రమాన్ని స్థానిక చిలకలూరిపేట పేట లోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీమతి పి. పద్మజ గారి అదర్యం లో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు హెచ్ఐ వి గురించి మరియు హెచ్ఐవి ఎన్ని మార్గాలు ద్వారా వస్తుంది అనే విషయాలను తెలియచేసారు.ఈ కార్యక్రమం కు ఏరియా హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ కె. హనుమంత్ రావు గారు మాట్లాడుతూ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు గురించి వివారించారు. అదేవిదంగా క్యాంపు స్వచ్చంద సేవ సంస్థ మేనేజర్ కొండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతు ఐఈసీ పాంప్లేట్ గురించి అందులో వున్న రిస్క్ అసెస్మెంట్ క్యూఆర్ కోడ్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్కూల్ విద్యార్థులు మరియు క్యాంపు సంస్థ అవుట్ రీచ్ వర్కర్ షామీమ్ గారు పాల్గొనడం జరిగింది.
Be the first to share your thoughts on this story!