వినుకొండ. సెప్టెంబర్ 04
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో వేంచేసియున్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి, స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలతో నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని బొల్లా బ్రహ్మనాయుడు స్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!