Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఉపాధ్యాయులపై దాడి దుర్మార్గం.....హోం మంత్రి అనిత

- డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు చేసేందుకు వైసీపీ ప్రయత్నం. &nbs

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 అమరావతి
📅 ప్రచురణ: 21 Sep 2026, 07:48 PM
🔄 నవీకరణ: 24 Sep 2026, 06:04 AM
👁️ 162 views

అమరావతి, సెప్టెంబర్ 21 : రాజధాని వాయిస్ :

ఉపాధ్యాయులపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీకి రౌడీయిజం, దౌర్జన్యం చేయడానికే రాజకీయ పార్టీ పట్టిందా అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్‌కు చదువు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం లేదని ఆమె విమర్శించారు. కరోనా సమయంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారని అనిత ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డీఎస్సీపై చేశామని, 16 వేల మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తప్పుడు ప్రచారం చేసేందుకు వైసీపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఉపాధ్యాయుల కష్టాన్ని అవమానించొద్దు

సాక్షి ఛానల్ ప్రతినిధులు ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి వారిని బెదిరిస్తున్నారని హోం మంత్రి ఆరోపించారు. దీంతో బాధపడిన ఉపాధ్యాయులు ఈరోజు రోడ్లపైకి వచ్చారని తెలిపారు. తాను కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చానని, ఒక ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతి నిరుద్యోగి కల అని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను అవమానపరిచేలా మాట్లాడటం సరికాదని అనిత అన్నారు. డీఎస్సీపై జగన్ చేసిన ఆరోపణలకు అధికారులు ఇప్పటికే అంశాల వారీగా వివరణ ఇచ్చారని తెలిపారు.

ఉపాధ్యాయులపై దాడిని సహించం

అల్లరి సృష్టించాలనే ఉద్దేశంతోనే వైసీపీ వాళ్ళు శాప్ కార్యాలయానికి వచ్చారని హోం మంత్రి ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు భావితరాలకు మార్గదర్శకులని అన్నారు.“టీచర్ల తలలు పగిలేలా కొడతారా? టీచర్లను నోటికొచ్చినట్లు తిడతారా?” అని అనిత ప్రశ్నించారు. విద్య, ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉన్నవారు ఈ విధంగా వ్యవహరించరని అన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తమ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా దాడులకు పాల్పడిన వారిని గుర్తించి అందరిపైనా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యారంగంలో మార్పులు

వైసీపీ హయాంలో జరిగిన ప్రతి దందా బయటకు వస్తుందని అనిత అన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పాఠశాలలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హోం మంత్రి అనిత అన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X