Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఉపాధ్యాయులపై దాడి హేయమైనచర్య:ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 21 Sep 2026, 06:44 PM
🔄 నవీకరణ: 25 Sep 2026, 05:53 AM
👁️ 116 views

శాప్ వద్ద ఉపాధ్యాయులపై దాడి దారుణం:

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆగ్రహం

అమరావతి.రాజధాని వాయిస్:

శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా న్యాయం కోరేందుకు వచ్చిన స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడటం అత్యంత హేయమైన చర్య అని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి రౌడీషీటర్లను రప్పించి వైఎస్ జగన్ ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చిన వారిపై భౌతిక దాడులకు దిగడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించకుండా నిత్యం కుట్ర రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు.
గత ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడిన వైసీపీ, కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీని అడ్డుకునేందుకు కోర్టు కేసులు వేసి విఫలమై చివరకు ఇలాంటి దాడులకు దిగుతోందని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌కు ప్రజాదరణ పెరగడాన్ని ఓర్వలేకనే జగన్ ఈ తరహా వికృత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజలను, ప్రతిపక్షాలను అణచివేసిన నియంతృత్వ ధోరణినే వైసీపీ ఇంకా కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులపై జరిగిన ఈ దాడిని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X