వెల్దుర్తి: సెప్టెంబర్ 09 రాజధాని వాయిస్ :
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నూతనంగా ప్రారంభించిన మహాత్మ జ్యోతిబాపూలే ఏపీ బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పీజీటీ బోధన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ పరమేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ లోపు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. డెమో క్లాసులు నిర్వహించి, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.
Be the first to share your thoughts on this story!