విజయవాడ, సెప్టెంబరు 27. రాజధాని వాయిస్ :
జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు.
*ముందు తెలిపిన విధంగా సెప్టెంబర్ 28 లోగా ఉన్న గడువును 2026 అక్టోబర్ 05 వ తేదీ కి పొడిగించడం జరిగింది. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను 2026 అక్టోబర్ 05 వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోగా కింది చిరునామాకు పంపాలి.*
*కమిటీ విచక్షణాధికారంతో ఎంపిక చేసే పురస్కారాలు*
*దరఖాస్తుల ఆధారంగా కమిటీ ఎంపిక చేసే అవార్డులు*
1. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ జర్నలిస్టు అవార్డు
నగదు పురస్కారం: రూ.2 లక్షలు
2. ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డులు
గ్రామీణ జర్నలిజంలో విశేష ప్రతిభ కనబరిచిన ముగ్గురు జర్నలిస్టులకు ప్రముఖ పాత్రికేయుల పేర్లతో మూడు అవార్డులు అందజేస్తారు.
ఒక్కో అవార్డు నగదు పురస్కారం: రూ.1 లక్ష
3. సావిత్రిబాయి పూలే ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డు
నగదు పురస్కారం: రూ.1 లక్ష
4. ఉత్తమ కార్టూనిస్టు అవార్డు
నగదు పురస్కారం: రూ.1 లక్ష
5. అబుల్ కలాం ఆజాద్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డు
నగదు పురస్కారం: రూ.1 లక్ష
6. ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డు
నగదు పురస్కారం: రూ.1 లక్ష
7. ఉత్తమ వీడియో జర్నలిస్టు అవార్డు
నగదు పురస్కారం: రూ.1 లక్ష
దరఖాస్తు విధానం – ముఖ్య నిబంధనలు
* జర్నలిస్టులు తాము పనిచేస్తున్న సంస్థ, ఉద్యోగ వివరాలు, తమ అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి.
* దరఖాస్తుతో పాటు కనీసం 5 వ్యాసాలు, వార్తా కథనాలు, ఫొటోలు, కార్టూన్లు లేదా వీడియో క్లిప్పింగ్స్ జతచేయాలి. అవి 2025 క్యాలెండర్ సంవత్సరంలో (01-01-2025 నుంచి 31-12-2025 వరకు) ప్రచురితమైనవి/ప్రసారమైనవి అయి ఉండాలి.
* వ్యాసాలు, వార్తా కథనాలు తదితర ఆర్టికల్స్‌ను ఫొటోకాపీల రూపంలో కూడా దాఖలు చేయవచ్చు.
* అవార్డు గ్రహీతల ఎంపికకు సంబంధించి ఎంపిక కమిటీదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అనుమతించబడవు.
* ఏదైనా విభాగంలో తగిన సంఖ్యలో లేదా తగిన ప్రమాణాలతో దరఖాస్తులు అందలేదని కమిటీ భావించినట్లయితే, సంబంధిత అవార్డును ప్రకటించకుండా నిలిపివేసే అధికారం ఎంపిక కమిటీకి ఉంటుంది.
* ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలోని మీడియా రిలేషన్స్ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు: (https://mediarelations.ap.gov.in/media)
*జారీ చేసినవారు: సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, విజయవాడ*
Be the first to share your thoughts on this story!