Tuesday, 20 October 2026
Header1
BREAKING

నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా విద్యార్ధులకు ఆల్బెండు జోల్ మాత్రలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 25 Sep 2026, 08:33 PM
🔄 నవీకరణ: 29 Sep 2026, 06:39 PM
👁️ 110 views

పిల్లల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నేషనల్ డి వార్మింగ్ డే

వైద్యులు అనిల్ కుమార్, శ్రీ కళ, ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

రాజధాని వాయిస్:

పిల్లల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యులు అనిల్ కుమార్ శ్రీకళ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ లూ తెలిపారు. డి వార్మింగ్ డే సందర్భంగా క్రోసూరు మండలం, దొడ్లేరు, అనంతవరం లోని అంగన్వాడీ సెంటర్లను హైస్కూల్స్ ను ఎలిమెంట్ స్కూల్స్ లో విద్యార్ధులు చేత ఆల్బెండు జోల్ మాత్రాలను స్వయంగా మింగించారు చేతులు పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత గూర్చి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ 25న ఆల్బెండజోల్ మాత్రలు వేసుకొని పిల్లలకు వచ్చేనెల అక్టోబర్ 5వ తేదీన మాత్రలు వేస్తారని తెలియజేశారు. పిల్లలకు నులిపురుగుల నిర్మూలన వలన కలిగే ప్రయోజనం గూర్చి వివరించారు. పిల్లలు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ మింగటం వలన రక్తహీనతను నివారిస్తుందని పోషకాల గ్రాహ్యతను మెరుగుపరుస్తుందని చదువుపై ఏకాగ్రతను, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు ఈ టాబ్లెట్స్ వేసుకునుట వలన పరిసరాలలో నులిపురుగుల వ్యాప్తిని తగ్గించి సమాజానికి మేలు చేయవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయిని జోస్ మేరీ, ఎలిమెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయిని పాపులమ్మ, మండలంలోని అందరూ ఆరోగ్య కార్యకర్తలు మండలంలోని అందరూ అంగనవాడి కార్యకర్తలు మండలంలోని అందరూ ఆశా కార్యకర్తలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X