వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే జూలకంటి
- మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్ అధికారులతో సమీక్ష
ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ:27 Sep 2026, 02:42 PM
🔄 నవీకరణ:02 Oct 2026, 12:32 AM
👁️ 147 views
మాచర్ల, సెప్టెంబర్ 27 రాజధాని వాయిస్ :
మాచర్ల పట్టణంలోని 11, 12, 13, 14వ వార్డుల్లో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో మౌలిక వసతులు, ప్రజలకు అందుతున్న సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నూతనంగా నిర్మించాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వార్డుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని తెలిపారు.
అనంతరం ఆయా వార్డుల్లోని కూటమి పార్టీల నాయకులతో ఎమ్మెల్యే ముఖాముఖి సమావేశం నిర్వహించి, స్థానిక సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల టీడీపీ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్-3 ఇంచార్జి కొమెర దుర్గారావుతో పాటు బూత్ ఇంచార్జీలు ఎస్.కే. జానీ, ఉప్పుతొల్ల చెన్నకేశవులు, బత్తుల చెన్నకేశవులు, శివ శంకర్ నాయక్, భవాని బాయ్ తదితరులు పాల్గొన్నారు.
వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే జూలకంటి
- మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్ అధికారులతో సమీక్ష
మాచర్ల, సెప్టెంబర్ 27 రాజధాని వాయిస్ :మాచర్ల పట్టణంలోని 11, 12, 13, 14వ వార్డుల్లో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో మౌలిక వసతులు, ప్రజల...
మాచర్ల, సెప్టెంబర్ 27 రాజధాని వాయిస్ :మాచర్ల పట్టణంలోని 11, 12, 13, 14వ వార్డుల్లో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో మౌలిక వసతులు, ప్రజలకు అందుతున్న సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నూతనంగా నిర్మించాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వార్డుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని తెలిపారు.
అనంతరం ఆయా వార్డుల్లోని కూటమి పార్టీల నాయకులతో ఎమ్మెల్యే ముఖాముఖి సమావేశం నిర్వహించి, స్థానిక సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల టీడీపీ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్-3 ఇంచార్జి కొమెర దుర్గారావుతో పాటు బూత్ ఇంచార్జీలు ఎస్.కే. జానీ, ఉప్పుతొల్ల చెన్నకేశవులు, బత్తుల చెన్నకేశవులు, శివ శంకర్ నాయక్, భవాని బాయ్ తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!