మాచర్ల సెప్టెంబర్ 09 రాజధాని వాయిస్:
మాచర్లలోని 4 వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంగన్‌వాడీ సిబ్బంది వివరించారు.
ఈ సందర్భంగా పౌష్టికాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను నిర్వహించి, వివిధ రకాల ఆహార పదార్థాల్లో లభించే పోషక విలువలను వివరించారు. చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు వారి ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో కృష్ణ వేణి , సూపర్‌వైజర్ దుర్గ, అంగన్‌వాడీ కార్యకర్తలు సుందర లీల,కమల,జయలక్ష్మీ, సహాయకులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!