మాచర్ల సెప్టెంబర్ 05 రాజధాని వాయిస్ :
మదర్ థెరీసా సేవా సమితి వారి ఆధ్వర్యంలో మాచర్ల పట్టణం, ఆర్ సి ఎమ్ ఎలిమెంటరీ పాఠశాల (చిన్న కాన్వెంట్ ), సమీపంలో గల మదర్
థెరీసా
విగ్రహం వద్ద, మదర్
థెరీసా
29 వ వర్ధంతి వేడుకలు ది :05-09-2026 శనివారం ఘనంగా జరిగాయి.ఈ వర్ధంతి కార్యక్రమం లో మాచర్ల పట్టణ చెన్నకేశవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమరా అనంత రాములు పాల్గొని మదర్
థెరీసా
చేసిన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చిన్న కాన్వెంట్ హెడ్మిష్ట్రెస్ సిస్టర్ అనిత మాట్లాడుతూ మదర్ తెరీసా చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ సేవకు ముందుకు రావాలని కోరారు. పట్టణ ప్రముఖ లాయర్ చిలమకూరి నాగిరెడ్డి మాట్లాడుతూ మెసెపడొనియా దేశం, అలబేనియా జాతికి చెందిన మదర్ తెరీసా, భారత దేశానికి వచ్చి ఎన్నో సంస్థలను స్థాపించి, ఎంతోమంది అనాధలను ఆదుకొన్న గొప్ప మాతృ మూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని మదర్
థెరీసా
సేవా సమితి ప్రధాన కార్యదర్శి మోరా భాస్కరరెడ్డి నిర్వహించారు.గాదె కిరీటిరెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు, అందుగుల చంద్రయ్య, లాయర్ అందు గుల బాల జోజి,చిన్న కాన్వెంట్ ఉపాధ్యాయులు ఘనంగా నివాళులు అర్పించారు.
Be the first to share your thoughts on this story!