Tuesday, 20 October 2026
Header1
BREAKING

మాచర్ల పురపాలక సంఘంలో సఫాయి కార్మికులకు ఘనంగా అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 25 Sep 2026, 07:46 PM
🔄 నవీకరణ: 26 Sep 2026, 01:33 PM
👁️ 113 views

మాచర్ల, సెప్టెంబర్ 25, రాజధాని వాయిస్ :
మాచర్ల పురపాలక సంఘం పరిధిలో పని చేస్తున్న సీవర్, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు మరియు చెత్త సేకరించే పారిశుధ్య కార్మికుల భద్రత, ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం "నమస్తే" కింద ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మరియు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు.మాచర్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నార్త్ ఇండియా టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ లిమిటెడ్ మరియు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారి భాగస్వామ్యంతో, జాతీయ "సఫాయి కర్ంచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్" సహకారంతో పురపాలక కౌన్సిల్ హాల్ నందు ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరిగింది.సురక్షితమైన యాంత్రిక పద్ధతులపై శిక్షణ:ఈ సందర్భంగా అధికారుల సమక్షంలో కార్మికులకు ప్రమాదకరమైన మ్యాన్యువల్ పద్ధతులకు స్వస్తి చెప్పి, అధునాతన సాంకేతికతను వినియోగించడంపై అవగాహన కల్పించారు.
WhatsApp Image 2026-09-25 at 6.24.28 PM.jpeg
ముఖ్యంగా ట్రైపాడ్ మరియు డిస్లాడ్జుడు వాహనాల వినియోగం, సెప్టిక్ ట్యాంకులను సురక్షితంగా యాంత్రికంగా డీ-స్లడ్జింగ్ చేసే విధానాలపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. విధి నిర్వహణలో పాటించాల్సిన భద్రతా చర్యలు, పి.పి.ఇ కిట్ల ప్రాముఖ్యత మరియు ప్రమాదకర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు వివరించారు.పారిశుధ్య సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు - మందుల పంపిణీ:కార్మికుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రవితేజ హాస్పిటల్ సౌజన్యంతో పురపాలక సంఘ పారిశుధ్య సిబ్బంది అందరికీ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో సిబ్బందికి ఉచితంగా రక్త పరీక్షలు, షుగర్, బి.పి పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన వివిధ వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్, మున్సిపాలిటీ ఉన్నతాధికారులు, శానిటరీ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో సీవర్, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు, వేస్ట్ పికర్స్ పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X