వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ.. విద్యార్థులకు నోట్‌బుక్స్, పండ్ల పంపిణీ
పిడుగురాళ్ల:
సమాజానికి తమ వంతు సేవ చేయాలనే సంకల్పంతో నవయువతరం ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం మరియు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో భాగంగా గుంటూరు విజయ సాయి స్త్రీల సంతాన సాఫల్య కేంద్రం గైనకాలజిస్ట్ డాక్టర్ యమ్. పద్మజ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై ఆన్‌లైన్ వెబినార్‌ను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం పిడుగురాళ్లలోని జమున స్కూల్‌లో చదువుతున్న 200 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, వ్రాత సామాగ్రి, పండ్లు, స్నాక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. రక్కు నాయక్ మాట్లాడుతూ.. నవయువతరం ఫౌండేషన్ వారు సమాజ హితం కోసం అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు చిగుళ్ల సుమలతతో పాటు కొత్త అరుణ, సాయి ప్రకాష్, గుండా సునీత, సైదారావు, ఆదిలక్ష్మి, అన్నపూర్ణ లక్ష్మి, షేక్ షఫీ, సిరాజ్, పవన్ కాత్యాయనీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
Be the first to share your thoughts on this story!