చీరాల. సెప్టెంబర్ 16
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన చీరాలలోని వై.ఎ. ప్రభుత్వ మహిళా కళాశాలలో భారీ ఉద్యోగాల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార పత్రాలను బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు పాల్గొని ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.పదోతరగతి,ఇంటర్మీడియట్, సాంకేతిక విద్య, వివిధ డిగ్రీలు, ఉన్నత విద్యార్హతలు కలిగి, 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు ఈ ముఖాముఖికి హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఎంపికైన వారికి విద్యార్హతల ఆధారంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం లభిస్తుందని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా అధికారిక అంతర్జాల చిరునామా (https://naipunyam.ap.gov.in/) నందు పేర్లు నమోదు చేసుకోవాలని, ఇంటర్వ్యూ జరిగే రోజున తమ వివరాల పత్రం, విద్యార్హతల నకళ్లు, ఆధార్ గుర్తింపు పత్రం, ఛాయాచిత్రాలతో నేరుగా హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు, సందేహాల నివృత్తి కోసం 7981443777, 8555901198, 9052202833 చరవాణి సంఖ్యలను సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళికాధికారి షాలేము రాజు, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా నిర్వాహకురాలు మాధవి, పరిపాలనాధికారి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!