ఫిరంగిపురం/గుంటూరు, అక్టోబర్ 25 : రాజధాని వాయిస్
ఫిరంగిపురంలో ఇ.వి.ఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదివారం తనిఖీ చేశారు. ఇ.వి.ఎంలు భద్రపరిచిన గదుల వద్ద భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, గోడౌన్ తాళాలు, సీల్లను పరిశీలించారు. ఇ.వి.ఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గోడౌన్ పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
Be the first to share your thoughts on this story!