కర్లపాలెం సెప్టెంబర్ 11 రాజధాని వాయిస్ :
ప్రజలు సమస్యలపై అందజేసిన అర్జీలను అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చేపట్టిన "ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో నిర్వహించి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరం చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట గారితో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని బాపట్ల నియోజకవర్గంలోని కర్ల పాలెం మండల పరిధిలోని పలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి వారు చెప్పే సమస్యలు వింటూ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ ప్రజలకు సంతృప్తికంరగా సేవలు అందించవలసిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధుల పై ఉందన్నారు.కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతోందని, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా నేరుగా వారి వద్దకే వచ్చి అర్జీలు స్వీకరిస్తున్నామని తెలిపారు. పి జి ఆర్ ఎస్ లో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారుల కు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ, డ్వామా,ఏ పి యం ఐ పి,పి డి లు బి.సింగయ్య,ఏ. వి.విజయలక్ష్మి, నీలిమ, డి పి ఓ.యల్.ప్రభాకర్ రావు, డి యం & హెచ్ ఓ.డాక్టర్ ఎస్.విజయమ్మ, డి సి హెచ్ ఎస్.డాక్టర్ పద్మావతి, ల్యాండ్ & సర్వే ఏ డి.సాంబశివరావు, జిల్లా వ్యవసాయ అధికారిణి ఏ.లక్ష్మి,పశు సంవర్ధక శాఖ జెడి.వేణు గోపాల్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ డి డి సత్యనారాయణ, GSWS అధికారి రాజేష్, ఎస్ ఎస్ ఏ పి ఓ. శ్రీనివాస్, డి ఐ ఓ.కోదండరామ్, తహశీల్దార్లు,యం పి డి ఓ లు,వి ఆర్ ఓ లు వివిధ శాఖ ల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!