నాగార్జునసాగర్:
వీపీ సౌత్ రాజధాని వాయిస్ :
నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి స్థిరంగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి రిజర్వాయర్లోకి 35,968 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా, అంతే మొత్తంలో మొత్తం 35,968 క్యూసెక్కుల నీటిని వివిధ మార్గాల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 535.20 అడుగులకు చేరింది. అలాగే జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 178.4758 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రస్తుతం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల నిలిపివేయగా, ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 28,512 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇక సాగు, తాగునీటి అవసరాల కోసం ఎడమ కాలువ ద్వారా 5,156 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 2,000 క్యూసెక్కులు, లోలెవల్ కెనాల్ (LLC)కు 300 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. కుడి కాలువ ద్వారా ప్రస్తుతం నీటి విడుదల పూర్తిగా నిలిచిపోయిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
Be the first to share your thoughts on this story!