మాచర్ల, సెప్టెంబర్ 21: రాజధాని వాయిస్ :
మాచర్ల పట్టణంలో సుమారు రూ.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం, సెప్టెంబర్ 22న డిజిటల్ కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.
పట్టణంలోని వివిధ వార్డుల్లో రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అభివృద్ధి పనులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని మాచర్ల పట్టణంలోని శ్రీనివాస మహల్ సెంటర్ ఆవరణలో డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రముఖులు హాజరుకానున్నారు.
Be the first to share your thoughts on this story!